ఆహా ! ఔరా !
అదేమి కుటుంబం ?
అది రవి అస్తమించని
బ్రిటిష్ రాజకుటుంబం...
ఆహా అదేమి యోగం ? అదేమి భోగం ?
ఔరా ! అదేమి రాజరిక వైభోగం ?
వారు "శయనించే"...
ఆ విలాసవంతమైన "బకింగ్ హామ్
ప్యాలెస్" ఇలలో ఒక ఇంద్రభవనమే...
వారు లండన్ ప్రజలకు దేవుళ్ళే దేవతలే...
వారు "అనుభవించేది" భూతలస్వర్గమే...
వారు "ఆరగించేది"...
అతి రుచికరమైన పసందైన పదార్థాలే...
అనునిత్యం విలాసాలే ఖుషీ కులాసాలే... విందు...వినోదాలే...ప్రతిరోజు పండగలే...
వారు "ధరించేది"...
"కోహినూర్" పొదిగిన వజ్రకిరీటాలే...
ఖరీదైన "బ్రాండెడ్ దుస్తులే...
మేలిమి "బంగారు ఆభరణాలే"...
వజ్రవైడూర్యాలే...రవ్వలే...రత్నాలే...
ఆణిముత్యాలే...మణి మాణిక్యాలే...
రవి అస్తమించని ఆ "బ్రిటిష్ చక్రవర్తులు"
ప్రక్కరాజ్యాలకు ప్రక్కలో బల్లెమై
దండయాత్రలతో దోచుకున్న భద్రంగా
దాచుకున్న ఆస్తులు అంతస్తులు...
ఆకాశంలో వెలిగే నక్షత్రాల్లా...
సముద్రతీరంలో...
ఇసుకరేణువుల్లా...లెక్కించలేనివే...
వారి సంపద...
మరోవెయ్యి తరాలకైనా తరగనిదే...
ఎంతో ప్రతిష్టాత్మకంగా...
అంగరంగ వైభవంగా...
ఏటా అక్కడ "జరిగేవి"...
కళ్ళుచెదిరే వెన్నెల కురిసే వేడుకలే...
వారు పొందే గౌరవం వెలకట్టలేనిదే...
వారిది ఏ జాతకచక్ర ప్రభావమో...
ఏ జన్మ పుణ్యఫలమో...ఏమో
వారెంతో అదృష్టజాతకులు....
వారే ఈ అవినిపై అపరకుబేరులు...
సువర్ణాక్షరాలతో లిఖించబడిన
ఆ బ్రిటిష్ రాజకుటుంబ చరిత్ర...
తరతరాలకైనా...తరగనిదే...
చెక్కు చెదరనిదే....
చిరకాలం చిరస్మరణీయమే.....



