రియల్ ఎస్టేట్ రంగమంటేనే అర్థం
రంగులు మార్చే ఊసరవెళ్ళులని
మొసళ్ళ మోసగాళ్ళమయమని
రక్తం త్రాగే రాక్షసమూకల రంగమని
తెలుసుకో నేస్తమా ! అణుక్షణం
అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
ఇందులో పరిచయమయ్యే
ప్రతివాడు ప్రాణమిత్రుడే పైకి
లోపల వాడొక బద్దశత్రువని
తెలుసుకో నేస్తమా !అణుక్షణం
అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
కనిపిస్తే చాలు వాడు
కాళ్లకు నమస్కారం చేస్తాడు
కాని, వాడే రేపు కడుపులో
కత్తులుంచుకొని,కౌగలించుకుంటాడని
తెలుసుకో నేస్తమా ! అణుక్షణం
అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
ఇందులో మాయమాటల మాంత్రికులు
అరచేతిలో స్వర్గం చూపించే అఖండులు
నమ్మించి నట్టేటముంచే నయవంచకులు
మనచుట్టే వుంటారని తెలుసుకో నేస్తమా!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా!
ఇందులో ఆశబోతులు అబద్ధికులు
సిగ్గూ లజ్జలేనివాళ్ళు నీముందే వుంటారని
మానవత్వమన్న పదానికి అర్థం తెలియని
మూర్ఖులు ముసుగులు వేసుకొని నీప్రక్కనే
నక్కల్లా నక్కి వుంటారని తెలుసుకో నేస్తమా !
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా



