Facebook Twitter
మొగల్తూరు మహారాజ్ అమర్ రహే…

విజయనగర సామ్రాజ్య
క్షత్రియ రాజవంశంలో...
పశ్చిమగోదావరి జిల్లా
మొగల్తూరులో జననం...
బాల్యంలో గుర్రపుబండిలో
బడికెళ్లిన సంపన్నుల బిడ్డ...
సహధర్మచారిణి శ్రీమతి శ్యామలాదేవి...
ముత్యాల్లాంటి ముగ్గురాడపిల్లలు ప్రసీద...ప్రకీర్తి...ప్రదీప్తి...ల కన్నతండ్రి...

"ఆంధ్రరత్నా" పత్రికలో జర్నలిస్టు...
"రాయల్ ఫోటో స్టూడియో" "నిర్మాత"....
గోపికృష్ణ మూవీస్ "అధినేత"
శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు
"చిలకా గోరింక" చిత్రంతో
సినీరంగంలో ప్రవేశించి...
శ్రీ "నారాయణరావు" గారిచే శిక్షణ పొంది
188 చిత్రాల్లో సాంఘిక పౌరాణిక చారిత్రక జానపద పాత్రల్లో అపూర్వ నటనను
ప్రదర్శించిన "విలక్షణమైన నటుడు"...

గోపికృష్ణ మూవీస్ సొంత బ్యానర్ లో
"కృష్ణవేణి...భక్తిరస చిత్రం భక్తకన్నప్ప... బొబ్బిలి బ్రహ్మన్న"చిత్రాలు నిర్మించి...
రౌద్రం...కరుణ రస పాత్రలను అద్భుతంగా
పోషించి... ప్రేక్షకులచే  జేజేలందుకున్న... 
"సాటిలేని మేటి నటుడు" "రెబల్ స్టార్'"
"తెలుగు తెర రారాజు" మన కృష్ణంరాజు

చిత్ర నిర్మాతగా...
విలక్షణమైన నటుడిగా...
గోపికృష్ణ మూవీస్ అధినేతగా...
అటు సినిమారంగంలో...

రాజకీయ నాయకుడిగా...
అటల్ బిహారీ వాజపేయి
మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా...
ఇటు రాజకీయాల్లో....
వారు చేసిన సేవలు చిరస్మరణీయం...

మనసున్న మహారాజు...
అందగాడు అందరివాడు...
మంచితనానికి మారుపేరు...
ఆరడుగుల ఆజానుబాహుడు...
అజాతశత్రువు ఆపద్బాంధవుడు...
శ్రీ కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని...
ఆ పరమ శివున్ని ప్రార్ధిస్తూ...
వారి కుటుంబసభ్యులకు...
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...
అశృనయనాలతో ఇదేనా అక్షరనీరాజనం...

జోహార్....జోహార్ ...రెబల్ స్టార్...
అమర్ రహే...అమర్ రహే...
మొగల్తూరు మహారాజ్...