2022 కామన్ వెల్త్ గేమ్స్ లో
బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ లో
కెనడా షట్లర్ మిషెల్లి లీని మట్టి కరిపించి
వరుస సెట్లలో (21-15 ...21-13)
పూసర్ల వెంకట సింధు "విజేతగా" నిలిచింది
మొన్న 2014 లో కష్టపడి ఆడింది
"కాంస్య పతకాన్ని"...సాధించింది
నిన్న 2018 లో మన సైనా నెహ్వాల్ తో
తలపడి హోరా హోరీగా పోరాడింది
"రజిత పతకాన్ని"...సొంతం చేసుకుంది
నేడు కోర్టులో చెమటలు...గ్రక్కింది
మన "భారత్ కు స్వర్ణం"...దక్కింది
పీవీ సింధు కీర్తి శిఖరం......ఎక్కింది
బర్మింగ్ హామ్ వేదికగా భారతీయ
"త్రివర్ణ పతాకం" రెపరెపలాడింది
భారతమాతకు.....భరతజాతికి
ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది
"తెలుగుజాతి జ్యోతి" పివీ సింధు
కసి కృషి దీక్ష పట్టుదల అంకిత భావంతో
కఠోరమైన శిక్షణతో...నిరంతర సాధనతో
అనుకన్న లక్ష్యాల్ని అవలీలగా సాధించి
కోట్లమంది భారతీయ యువఆటగాళ్లకు
"స్పూర్తి ప్రదాతగా" యువ అంబాసిడర్ గా"
నిలిచింది మన "తెలుగుతేజం" పీవీ సింధు
జయహో ! జయహో !
ఓ జాతి రత్నమా...!
కోట్లమంది గుండెల్లో వెలిగే
ఓ స్వర్ణ దీపమా...!
తెలుగు జాతి జ్యోతివై...
దేశ విదేశాలలో
ఎగిరే శాంతి కపోతమై....
రెపరెపలాడే మువ్వన్నెల
జాతీయ పతాకమై...
మా పివీ సింధుగా...
విజయాల విందుగా ...
నీ అఖండకీర్తి విశ్వమంతా
విస్తరించును గాక...!



