Facebook Twitter
తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

మొన్న...అట్టడుగున
ఊరికి చిట్టచివరన ఉన్న

నిన్న...విద్యకు...
విజ్ఞానానికి...ఆర్థిక వనరులకు...
ఆయుధాలకు...ఆమడదూరంలో ఉన్న

నేడు...
పూరిగుడిసెల్లో పుట్టి...
ఆకలికి అలమటించి...
స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం...
సంఘంలో సమానత్వం కోసం...
చేజారిన పౌరహక్కుల పరిరక్షణ కోసం...
ఆత్మగౌరవం కోసం పోరాడిన...పరితపించిన

ఈ కొండ జాతి మనుషులు...
ఈ భరతమాత ముద్దుబిడ్డలు...
ఈ దగాబడ్డ దళితజాతి మేధావులైన
శ్రీ కె. ఆర్ నారాయణన్ గారు
10వ రాష్ట్రపతిగా...
శ్రీ రామ్ నాద్ కోవింద్ గారు
14వ రాష్ట్రపతిగా...
శ్రీమతి ద్రౌపది ముర్ము గారు
15వ రాష్ట్రపతిగా...
నా భారతదేశ అత్యున్నత
అధికారపీఠాన్ని అధిరోహించినందుకు...

సాహసోపేతమైన
ఈ రాజకీయ నిర్ణయాన్ని
హర్షించాలా...? విమర్శించాలా....?
హర్షించి తీరాలి
కలనైనా ఊహించని
ఈ సువర్ణావకాశానికి...
అభినందించాలా...?అనుమానించాలా...?
అభినందించి తీరాలి...కారణం

ఒకనాడు
అమరజీవి అంబేద్కర్
కలగన్నది...కలవరించింది
చివరిశ్వాస వరకు పోరాడింది...
అట్టడుగున ఉన్న ఈ జాతి
ఈ అభ్యున్నతి కోసమే...
ఈ ఆత్మ గౌరవం కోసమే...
ఈ అధికార పీఠం కోసమే...
ఈ అత్యున్నత హోదా కోసమే...

అందుకే ఎంతో ముందుచూపుతో
ఓ నా భారతమాత ముద్దుబిడ్డలారా !
మీ ఆరాటం...
మీ పోరాటం...
మీ ఆశయం...
మీ ఆలోచనలు...
అన్నీ ఆకాశం వైపే...
తూర్పున ఉదయించే
ఆ సూర్యోదయం కోసమే...
చీకటిలో చితికిన మీ బ్రతుకులు
వెలుగుమయం కావడం కోసమే...
అన్న ఆ స్పూర్తి ప్రదాత...
భారత రాజ్యాంగ నిర్మాత
అమరజీవి అంబేద్కర్ ని
సదా స్మరించుకొంటూ...

నేడు 15 రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని

అలంకరించింది శ్రీమతి ద్రౌపది ముర్ము...