అల్బేనియా నివాసులైన
నికోల్లే,డ్రాన బొజాక్షిహ్యుల
ఏ జన్మపుణ్యఫలమో
ఆగ్నేపుణ్యదంపతులైనస్
గోంక్షే బొజాక్షిహ్యు జన్మించింది.
అర్థం గులాబీ మొగ్గ
ఆమొగ్గే మదర్ థెరిస్సానే
మహావృక్షమైంది
కోల్కతా మురికివాడల్లో
అనాధలకూ అన్నార్తులకు
చదువు చెప్పిన
ఒక స్కూల్ టీచర్ థెరిసా
కోల్కతాలో వచ్చిన కరువు
ఆమెను కదిలించింది
అకాలంలో చెలరేగిన
మతవిధ్వేషాలు జరిగిన
విధ్వంసాలు ఆమే మనుగడనే మార్చివేశాయి
భారతపౌరసత్వం స్వీకరించింది
ఆమె పూర్తిగా పేదప్రజల
సేవకే అంకితమైంది
జంతువుగా బ్రతికినా
దేవతలా చనిపోమంటూ
మూడుమతాల శవాలకు
అందమైన మనిషిచావుకు
అంతిమ సంస్కారం కోసం -
'నిర్మల్ హృదయ్" ని
ఆరోగ్యం ఆహారం ఆదరణ
బ్రతుకు మీద ఆశను
కల్పిస్తూ కుష్టు వ్యాధిగ్రస్థులకోసం -"శాంతినగర్" ని
అంత్యదశలో సత్వర వైద్యసేవలు
అందిస్తూ -'హోం ఫర్ డయింగ్" ని
అంధులకు, వృద్దులకు,
వికలాంగులకు మధ్య పాన ప్రియులకు,
వరద బాధితులను కరువు పీడితులు
విద్య వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు
మినిస్ట్రీ స్ ఆఫ్ చారిటీ స్ సేవాసంస్థ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాల్లో 610 సంస్థలను స్థాపించి సమర్థవంతంగా నిర్వహించిన అధినేత
రెండు సార్లు గుండె పోటు వచ్చినా
విశ్రాంతి లేకుండా విరామం లేకుండా
విధులు నిర్వహించిన కార్యశీలి
శత్రృదేశాల మధ్య
శాంతిఒప్పందాలు కుదిర్చి
ఇథియోపియా ఆకలి బాధితులను
చెర్నబిల్ అణుధార్మిక పీడితులను
అర్మేనియా భూకంప బాధితులను
అక్కున చేర్చుకుని చేసిన
అపూర్వసేవలకు గుర్తింపుగా
నోబెల్ శాంతి బహుమతి
అందుకున్న శాంతిదూత
ఆకలిగొన్న వారికి అన్నపూర్ణ
దిగంబరరులకు దివ్య వస్త్రం
నిరాశ్రయులకు చల్లని నీడ
వికలాంగుకు ఒక వీల్ చైర్
భూమికి భారమైన వారికి కొండంత అండ
ఇంటికి దూరమైన వారికి ఆదరణకర్త
కుష్టు క్షయవ్యాధిగ్రస్తులకు ఒక దేవదూత
మదర్ థెరిస్సాఅంటేనే ఒక ప్రేమపావురం,
ఆమెచూపులోఆప్యాయతలో అమృతం
ఆమె పిలుపులో అమ్మతనం వుంటుంది
ఆమె పలికిన ప్రతి పలుకు ప్రేమమయం
కరుణామయుడు ప్రేమకు ప్రతిరూపమైన
అభిషిక్తుడే ఆమెకు అడుగడుగున ఆదర్శంTop of FormBottom of Form



