ఆమే మాతృమూర్తి మదర్ థెరిస్సా
ఆమే చూపు ఆకాశమంత విశాలం
ఆమె హృదయం లోతైన శాంతి సముద్రం
ఆమె మనసు నవనీతం
ఆమె జీవితం నిరుపేదలకే అంకితం
ఆమె మాట అమృతం
ఆమె పలుకు పలుకులో తేనెలొలుకు
ఆమె పిలుపు కమ్మనైన అమ్మ పిలుపు
ఆమె తలపు నిర్థయులను మేలుకొలుపు
ఆమె అంతులేని కరుణకు ప్రతిరూపం
ఆమె నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం
ఆమె ప్రేమ అనంత సాగరం
ఆమె హస్తాలు ఆకలిని తీర్చి
ఆపదలో ఆదుకునే
అభయామృతహస్తాలు
ఆమె కనని బిడ్డలు అనాథలు
తాడిత పీడిత బడుగు బలహీనులు
బహుజనులు, కుష్టు క్షయ,వ్యాధిగ్రస్తులు
ఆమె కీర్తి అఖండం అజరామరం
ఆమె ఒక త్యాగమూర్తి
ఆమెఎందరికో స్ఫూర్తి
ఆమెను స్మరించుకుందాం ,
సేవలు గుర్తు చేసుకుందాం
ఆమెలా అందరికీ ప్రేమను పంచుదాం మంచిని పెంచుదాం



