సమాతామూర్తి...ఆత్మ సందేశం...( 2 )
గుడిగోపురం ఎక్కి ఊరంతా
వినిపించిన నా అష్టాక్షరీ తిరుమంత్రం
...ఓం నమో నారాయణాయః
మానవాళికి నా దివ్య సందేశమొక్కటే:
...భగవంతుని దృష్టిలో
...మానవులందరూ సమానులే...
...కులవివక్ష తగదు...
...సకలజీవులను ప్రేమిద్దాం...
...వేదాలవెలుగులో పయణిద్దాం...
...సనాతనధర్మం...సమానత్వం...
...మన విశిష్టాద్వైతానికి మూలసూత్రాలు...
...ఆలయపాలన అవినీతి రహితంగా సాగాలి...
నా గురువులు నలుగురు :
...కాంచీపూర్ణుడు యాదవ ప్రకాశుడు
...గోష్టిపూర్ణులు. యమునాచార్యుల పార్థివదేహం
...ముందు నేను చేసిన మూడు ప్రమాణాలు :
...బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం
...ఈ భూమిపై విశిష్టాద్వైత మతాన్ని స్థాపించడం
...ఆసేతుహిమాచల పర్యటన విష్ణుదేవాలయాల నిర్మాణం



