పిచ్చివాళ్ళు
ఓట్లేసిన అమాయకపు
ప్రజల నోట్లోమట్టికొట్టి
కోట్లుకోట్లు దాచుకున్న
కోట్లు కోట్లు ఆస్తులున్న
కోట్లమంది అభిమాలున్న
అందరిచే అమ్మా అని
పిలిపించుకున్నజయలలిత
జాతకం తారుమారై
ఒక్కరూ
ప్రక్కన లేకండ చివరకు
దిక్కులేనిదైపోయింది
అలాగే నమ్మినవాళ్లను
నట్టేటముంచి
అన్నమాట మీద నిలబడక
పచ్చిఅబద్దాలు ఆడుతూ
దొంగతనంగా దోచుకొనేవాళ్ళకు
అత్యాశతో బ్యాంకులో
దాచుకునేవాళ్ళకు
అదే రాసిపెట్టి వుంటుంది
ఎక్కువకాలం ఎవ్వరినీ
ఎవరు మోసంచేయలేరు
నీతి తప్పినవాళ్ళు
మాయమాటలు చెప్పేవాళ్లు
అరచేతిలో స్వర్గం చూపేవాళ్లు
నమ్మకద్రోహులు ఆశబోతులు
పిల్లికి బిక్షం పెట్టని పిసనారులు
పచ్చి మోసగాళ్ళు
పిచ్చివాళ్ళకిందే లెక్క
వాళ్ళు బ్రతికివున్నా
చచ్చినోళ్ళకిందే లెక్క
మూటికి ముమ్మాటికీ వాళ్ళు
గుంటకాడి నక్కలే
కక్కినదానికి ఆశపడే కుక్కలే.



