దివ్య క్షేత్రంలో మహావిగ్రహం ఎదుట
8 హంసలు 8 ఏనుగులు 8 సింహాలతో
అష్టదళ పద్మాకృతిలో
రాత్రివేళ మ్యూజిక్ త్రీడీ షోతో
శ్రీ రామానుజాచార్యుల్ని అభిషేకించే
25 కోట్ల 45 అడుగుల అందమైన
రాగి ఫౌంటెన్...అదిగో అదిగో
తిలకించి...పులకించి పోదాం ! రండి రండి !!
శ్రీ రామానుజాచార్యుల
స్వర్ణమయవిగ్రహం చుట్టూ
నల్లరాతితో చెక్కబడిన
8 పుణ్య క్షేత్రాలు...బద్రీనాథ్ ముక్తినాథ్
అయోధ్య బృందావనం
తిరుమల ఆలయాల తరహాలో
రాజస్థాన్ లోని పింక్ గ్రానైట్ తో
108 దివ్యదేశాల( వైష్ణవఆలయాల)నిర్మాణం...
ఆ ఆలయాల మధ్య
468 స్తంభాలతో భారీ దివ్యదేశమండపం...
అదిగో...అదిగో....
తిలకించి...పులకించి పోదాం ! రండి రండి !!
1017 ఏప్రిల్ 3 న తమిళనాడులోని
శ్రీపెరంబుదూర్‌లో పుణ్యదంపతులైన
శ్రీ కేశవ సోమయాజి కాంతిమతులకు
1000 ఏళ్ళ క్రితం జన్మించిన యోగి
వర్ణవ్యవస్థను కులవివక్షను వ్యతిరేకించి
అర్చకవర్గాల ఆగ్రహానికి గురైన సంఘసంస్కర్త...
సనాతనధర్మం...సమానత్వమే పటిష్టమైన
పునాదులుగా విశిష్టాద్వైత మతస్థాపకులు
సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులవారి
విగ్రహావిష్కరణ మహోత్సవం
కనుల విందుగా...పసందుగా
అంగరంగ వైభవంగా జరుగుతోంది...
తిలకించి...పులకించి పోదాం ! రండి రండి !!



