హైదరాబాదులోని
శంషాబాదులో ముచ్చింతల్
గ్రామంలో శ్రీ రామనగర్ లో
45 ఎకరాల దివ్యక్షేత్రంలో
ఆథ్యాత్మిక గురువు
శ్రీ త్రిదండి చిన్నజీయర్
స్వామివారి సారథ్యంలో
చైనా నిపుణులచే నిర్మించబడిన
ప్రపంచంలోనే థాయ్ లాండ్ లోని
బుద్దవిగ్రహం తర్వాత రెండవ ఎత్తైన
216 అడుగుల సమతామూర్తి
శ్రీ రామానుజాచార్యుల వారి పంచలోహ
మహా విగ్రహావిష్కరణోత్సవ సంబరాలు...
తిలకించి...పులకించి పోదాం ! రండి రండి !!
అదిగో తొమ్మిది రాష్ట్రాల
ముఖ్యమంత్రులకు ఆహ్వానం ....
పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న
216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల
స్వర్ణమయ మహా విగ్రహావిష్కరణ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారిచే...
120 సంవత్సరాలు జీవించిన
శ్రీ రామానుజాచార్యుల
54 అంగుళాల
120 కిలోల బంగారు విగ్రహావిష్కరణ...
రాష్ట్రపతి శ్రీ రామనాద్ కోవింద్ గారిచే...
ప్రసిద్ధ ‘కగాడియా’ శైలిలో
ప్రవేశద్వార రూపకల్పన
ప్రధానద్వారం వద్ద
18 అడుగుల హనుమాన్
గరుడ విగ్రహాలు...అవిగో...అవిగో
తిలకించి...పులకించి పోదాం ! రండి రండి !!



