Facebook Twitter
సమతామూర్తి‌...సందేశం (2)

బలహీనతలనుండి బయటపడే
దుర్వెసనాలనుండి విముక్తి చెందే
మంచి మార్గాలను చూపెట్టాలిరా !

ప్రతిమనిషి ఆ పరమాత్మకు ప్రతిరూపమేనని
సాటి మనిషిని మనిషిలా గౌరవించాలిరా !

కలిసి వుండాలిరా  కలుపుకు పోవాలిరా
ఈ సమాజంలో సనాతనధర్మం మానవీయ
విలువలు వెల్లివిరియాలిరా !

సహనం సమానత్వం సౌభ్రాతృత్వం
మంచితనం మానవత్వం అందరూ
ఆభరణాలుగా కలిగి వుండాలిరా !
అందుకే

భక్తి జ్ఞానం గుణం ప్రధానం
కానీ కులం కాదురా !
అంతరంగంలో అహంకారాన్ని నింపుకోరాదురా !

అంటరానితనాన్ని
మంటకలపాలిరా ! 
జాతి కుల మత వర్గ వర్ణ
లింగ వివక్షలుండరాదురా !

సమతా మమతలే
ఉచ్ఛ్వాస నిచ్చ్వాసాలుగా
జీవించాలిరా ! పదిమందికి 
మంచిని మానవత్వాన్ని
ప్రేమపరిమళాలను పంచి
మరణించినా ముందు తరాలకు
నీవే మార్గదర్శివై నిలవాలిరా !

ప్రతివానిని సొంత సోదరునిలా ప్రేమించాలిరా !
ప్రేమిస్తానిని ఆ భగవంతుని
ముందు ప్రతినబూనాలిరా !
భగవద్గీత సాక్షిగా నేడే ప్రమాణం చేయాలిరా !