Facebook Twitter
సమతామూర్తి‌...సందేశం (1)

వినరా వినరా ! ఓ నరుడా !
దైవం ముందు అందరూ
సమానమేనని తెలుసుకోరా !

ఎక్కుతక్కువ తేడాలను పక్కనపెట్టి
ప్రతిమనిషిని ఆప్యాయతతో అక్కునచేర్చుకోరా !

మేమే ఎక్కువన్న అహంతో విర్రవీగకండిరా !
అందరూ కళ్ళు తెరిచేది ఆ తల్లిగర్భంలోనె
కళ్ళుమూస్తే అందరూ వెళ్ళేది ఆ కాటికేకదరా !

ఒకరు అసహ్యంగా అశుభ్రంగా ఉన్నారని
ఆర్థికంగా చితికి ఉన్నారని చీకటిలో ఉన్నారని
చిన్నచూపు చూడకండిరా !

ఎవరినీ నీచంగా భావించకండిరా !
అణిచివేయకండిరా ! అణగద్రొక్కకండిరా !

ఎదుటివారితో వ్యంగ్యంగా
వెకిలిగా వెటకారంగా మాట్లాడకండిరా !

తెలిసీ తెలియక తప్పులుచేస్తే క్షమించాలిరా !
చిన్నతప్పుకు పెద్దశిక్ష వేయకండిరా ! వేధించకండిరా !

చిన్నచిన్న లోపాలుంటే సహనంతో సరిదిద్దాలిరా !