సమానత్వమే విశిష్టాద్వైత
సిద్దాంతమంటూ విప్లవ శంఖాన్ని పూరించి
కులవ్యవస్థను కూకటివేళ్లతో సహా
పెకలించి...ప్రభంజనాన్ని సృష్టించిన
అర్చకుల అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన...
సాహసి సమతావాది...శ్రీ రామానుజాచార్యులవారు
శూద్రుడైన పట్టిని పెరుమాళ్
గుడిసెలో విశ్రాంతి తీసుకున్న
కావేరిలో స్నానమాచరించి
శూద్రుడైన ధనర్దాసు భుజంపై చెయ్యేసి
తాకితే మైలపడమనేతత్త్వం తప్పని
నిరూపించి నిత్యం గుడికెళ్ళి పూజలు చేసిన...మానవతావాది...
శ్రీ రామానుజాచార్యులవారు
నేటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని
శ్రీ వెంకటేశ్వర వైభవానికి నాడే బీజం వేసిన
ప్రామాణికమైన సేవలకు శ్రీకారం చుట్టిన
శ్రీవారి ఆలయఅర్చనలో వైష్ణవశైవుల మధ్య
చెలరేగిన వివాదాన్ని విజ్ఞతతో పరిష్కరించిన...సమైక్యతావాది...
శ్రీ రామానుజాచార్యులవారు
ఈ సమాజంలో ప్రతిమనిషిలో
సమతా మమతలు
వెల్లివిరియాలని మానవతా
విలువలు పరిమళించాలని
ఆ సమతామూర్తి పాదాలకు
ప్రణమిల్లి ప్రతిజ్ఞ చేద్దాం !
ఆ ఆదర్శమూర్తి అడుగుల్లో
అడుగులు వేద్దాం !
వారి ఆశయాలకు మన
జీవితాలను అంకితం చేద్దాం !



