Facebook Twitter
సమతాముర్తి...జగద్గురువు… శ్రీ రామానుజాచార్య (1)

గురువు గోష్టిపూర్ణులు
చెవిలో రహస్యంగా చెప్పిన
ఓం నమో నారాయణాయః 
అష్టాక్షరీ మోక్షమంత్రాన్ని
గుడిగోపురమెక్కిగుట్టువిప్పి
ఊరంతా వినిపించి విన్నవారంతా
స్వర్గానికెళ్తే వాగ్దాన భంగం చేసిన
నేను నరకానికెళ్ళడానికి సిద్ధమేనని
వెయ్యేళ్ళనాడే వేదం వెలుగులో
సనాతనధర్మాన్ని సమానత్వాన్ని
సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన...
సమతాముర్తి...శ్రీ రామానుజాచార్యులవారు

తొండూరులో అన్నికులాలవారు
త్రాగేందుకు...జలాశయాన్నేర్పాటు చేసిన
భగవంతుడుకోరేది భక్తి జ్ఞానమేనని కులంకాదని దళితులతో...
సహపంక్తి భోజనాలు చేసిన
అంటరానివారికి ఆలయ ప్రవేశం...కల్పించిన...
సంఘసంస్కర్త...
శ్రీ రామానుజాచార్యులవారు

విశిష్టాద్వైత మతప్రచారానికై
12 మంది మహాభక్తులైన ఆళ్వారుల్లో
10 మంది శూద్రులను...నియమించి
వెయ్యేళ్లనాడే సమాజాన్ని పట్టిపీడించే
మనువాద సిద్దాంతాలైన అంటరానితనం
వర్ణవ్యవస్థలపై త్రికరణశుద్ధితో తిరుగుబాటుచేసి
విశ్వం విస్తుపోయేలా విశ్వసందేశాన్ని అందించిన... జగద్గురువు...
శ్రీ రామానుజాచార్యులవారు