Facebook Twitter
సమతాముర్తి… శ్రీ రామానుజాచార్యులవారు (2)

శూద్రుడైన పట్టిని పెరుమాళ్
గుడిసెలో విశ్రాంతి తీసుకున్న
కావేరిలో స్నానమాచరించి
శూద్రుడైన ధనర్దాసు భుజంమీద
చేయివేసి నిత్యం గుడికివెళ్ళి పూజలు చేసిన...
మానవతావాది...శ్రీ రామానుజాచార్యులవారు

తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి
శ్రీ వెంకటేశ్వర వైభవానికి కారణభూతులైన
నాడు శ్రీవారి ఆలయ అర్చనలో వైష్ణవ శైవుల
మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించిన
సమైక్యతావాది...శ్రీ రామానుజాచార్యులవారు

ఈ సమాజంలో ప్రతిమనిషిలో సమతా మమతలు
పరిమళించాలని మానవతా విలువలు వెల్లివిరియాలని
ఆ సమతామూర్తి పాదాలకు ప్రణమిల్లి ప్రతిజ్ఞ చేద్దాం !
ఆ ఆదర్శమూర్తి అడుగుల్లో అడుగులు వేద్దాం !
వారి ఆశయాలకు మన జీవితాలను నేడే అంకితం చేద్దాం !