Facebook Twitter
నల్లజాతి సూరీడు ....

కొండల్లో పుట్టి
దట్టమైన అడవుల్లో పెరిగి
వర్ణ వివక్షకు బలైపోయే
అమాయకపు దక్షిణాఫ్రికా ప్రజల
సామాజిక హక్కులకోసం
సమానత్వం కోసం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం పోరాడి
రోబెన్ దీవిలో27 సంవత్సరాలు
జైలుజీవితం గడిపిన విప్లవవీరుడు

శాంతి కోసం నల్ల శ్వేత జాతీయుల
నడుమ శాంతియుత సహజీవనంకోసం
జీవితానన్నే త్యాగం చేసిన పోరాటయోధుడు
ఒకే ఒక్కడు దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా

అహింస సత్యం ధర్మం ఆయుధాలతో
గాంధేయ మార్గంలో పయనించిన
అనుకున్న ఆశయాను సాధించిన
భారతరత్న నోబుల్ శాంతిబహుమతి గ్రహీత
ఒకే ఒక్కడు దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా

దక్షిణాఫ్రికా గాంధీగా కీర్తి గడించిన
మహాఘనుడు ,ధన్యజీవి త్యాగధనుడు
ప్రత్యర్థులచే ప్రశంస లను,లెక్కకుమించి
పురస్కారాలనందుకొన్న పుణ్యమూర్తి
ఒకే ఒక్కడు దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా