అలతిఅలతి పదాలతో...
అనంతమైన అర్ధాలతో...
ఆటంబాంబులాంటి
ఆటవెలుదులతో...
సమాజంలోని
దురాచారాలను సమాధి చేసి...
ప్రజల్లో చైతన్య జ్వాలల్ని రగిల్చిన...
ప్రజాకవి...మన...యోగివేమన
అందరినీ అలరించే
పసందైన వేమన పద్యాలు...
సకలజనులకు సుఖాలనొసగే...
సుందర సుభాషితాలు
సూర్యకిరణాలు...సుప్రభాతాలు...
నిజజీవిత నిత్యసత్యాలు
అనుభవాల...అభ్యుదయ భావాల...
ఆణిముత్యాలు...
నిండుకుండలు...నీతికినిధులు...
రగిలే నిప్పురవ్వలు...
చీకటిలో చిరుదివ్వెలు...
సత్యానికి సజీవసాక్ష్యాలు...
తియ్యని ఫలాలను...
చల్లని నీడనిచ్చే పచ్చనివృక్షాలు...
అందరినీ అలరించే
పసందైన వేమన పద్యాలు...
సామాజిక చైతన్యరథాలు...
నీతికి నిచ్చెనలు...
సమాజంలోని...
మొండివ్యాధులకు మందులు...
అరుణోదయ కిరణాలు...
ఎక్కుపెట్టిన రామబాణాలు...
సుఖజీవన సూత్రాలు...
స్పూర్తి మంత్రాలు...వెలుగు దీపికలు...
ఒక భోగిలా...
ఒక త్యాగిలా...
ఒక యోగిలా...
ఒక కవిలా ప్రజాభిమానాన్ని...
ప్రపంచమేధావులు ప్రశంసలను...
ముందు వెయ్యితరాలకైనా తరగని...
ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన....
విశ్వకవి...మన...యోగి వేమన...
విశ్వదాభిరామ వినురవేమ...
మకుటం కాదది...ఒక మంత్రదండం...
(ప్రజాకవి యోగివేమన 390 వ జయంతి సందర్భంగా అక్షరాంజలి)



