తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ
రాజకీయనేత...యువతకు స్పూర్తి ప్రదాత
తెలుగు హిందీ ఉర్దూ సంస్కృతం
ఫారసీ ఆంగ్లభాషల్లో...పట్టు సాధించిన దిట్ట
గోల్కొండ పత్రిక భారతి సాహిత్య పత్రిక
ప్రజావాణి పత్రికల....సంపాదక శిఖామణి
తెలంగాణ ప్రజల
కన్నీటిగాథలకు కరిగిన సురవరం
కలంచెక్కిన ప్రతిఅక్షరం
వారి పాండిత్యానికి ప్రత్యక్షసాక్ష్యం
తన కలంకత్తితో నిజాం
నిరంకుశపాలనను వ్యతిరేకించిన
ఉక్కుమనిషి...ఉద్యమకారుడు...
బహుముఖ ప్రజ్ఞాశాలి
తెలుగు భాషకై కృషి చేసిన పరిశోధకుడు...బహుభాషా కోవిదుడు...కేంద్ర సాహిత్య అకాడమి"అవార్డు గ్రహీత"
తెలంగాణలో కవులు లేరన్న నిందావ్యాఖ్యలకు నిరసనగా
354 మందితో గోల్కొండ
కవులసంచిక తెచ్చిన వైతాళికుడు
శాసనసభ్యుడిగా
అఖండ ఖ్యాతినార్జించి
ట్యాంక్ బండ్ పై
విగ్రహమై వెలసిన వీరుడు
తెలంగాణ ప్రజలగుండెల్లో
ఆరనిదీపమై వెలిగే
మన సురవరం
తెలుగుజాతికి ఒక గొప్పవరం
తెలుగుతల్లి మెడలో మెరిసే
ఓ ముత్యాలహారం
ఆ అమరజీవికి
ఆ త్యాగమూర్తికిదే నా అక్షరనీరాజనం



