సేవాత్పరుడు కార్యశీలి స్నేహశీలి
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి
పదవీవిరమణ శుభాకాంక్షలు
వారి విశిష్ట విలక్షణ విభిన్న
వ్యక్తితత్వం ఎలాంటిదంటే...
వారి హస్తం అభయహస్తం
వారి హృదయం నవనీతం
వారి సాంగత్యం పూర్వజన్మ సుకృతం
వారు ఉత్తమ ఉపాధ్యాయులు
ఊరికి ఉపకారి
బహుదూరపు బాటసారి
వారు నిగర్వి నిత్యం నవ్వులురువ్వే నిర్మలమూర్తి
ఆయన ప్రేమామయుడు ఆత్మబంధువు
అజాతశత్రువు ఆపద్బాంధవుడు సింహబలుడు
పనిరాక్షసుడు దయామయుడు
దయార్ద్రహృదయుడు
దానకర్ణుడు కరుణామయుడు
కృషీవలుడు కార్యసాధకుడు
నవయుగ వైతాళికుడు
ఎత్తైనఎవరెస్టు శిఖరం పేదప్రజలపక్షపాతి
నీడనిచ్చే పచ్చని వృక్షం కదిలే సాహసనౌక
నిస్సహాయులెందరికో కొండంత అండ
ఆయన ఒక ఆశాదీపం ఆశాజ్యోతి ప్రభాతకిరణం
ప్రకాశించే ప్రభాకరుడు
సాహితీవేత్త స్పూర్తి ప్రధాత
సాహిత్య శిఖరం
ఆదర్శమూర్తి మార్గదర్శి
మంచిమనీషి మహనీయుడు
మహాత్ముడు
మరిచిపోలేని స్నేహితుడు
అందరివాడు అందరికీ అందుబాటులో
ఉండేవాడు ఆలోచనాపరుడు మచ్చలేని
వ్యక్తిత్వంగల మహారాజు మానవత్వం
మంచితనం సహనం సమానత్వం
సౌభ్రాతృత్వం ఆయనకు
పెట్టని ఆభరణాలు
ఎన్నో అవార్డులు రివార్డులు అందరికీ
పాదాక్రాంతమౌతాయి కానీ అవన్ని వీరికి
సువర్ణభూషిత రత్నఖచిత మణిమయ
వజ్రకిరీటాలయ్యాయి
ఆయన సంకల్పం వజ్రసంకల్పం
ఆయన దివ్యదృష్టిగల ఓ మహర్షి
ఆయన సహాయం పొందిన ప్రతివారు
ఆయనకు గుండెల్లో గుడికట్టి దైవంగా ఆరాధిస్తారు
వారి మానవతా విలువలు
నీతి నిజాయితీ సేవాదృక్పథం త్యాగగుణం
నిరంతరం చిరస్మరణీయం
అభినందనీయం ఆదర్శనీయం
వారి శేషజీవితం సుఖమయం కావాలని
వారికి ఆ భగవంతుడు వెయ్యి ఏనుగు బలాన్నివ్వాలని
వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
నిండు నూరేళ్లు హాయిగా సుఖంగా ప్రశాంతంగా
కుటుంబంతో ఖుషీగా పిల్లాపాపలతో చల్లగా జీవించాలని
మనసా వాచా కర్మణా కోరుకుంటున్న........



