శివగారు నిండుకుండ
నిగర్వి నిరాడంబరుడు
ఎందరికో స్ఫూర్తి ప్రధాత
చేపట్టిన పదవికి వన్నె తెచ్చినవాడు
ముసిముసి నవ్వుల మృధుస్వభావి
ఆపదలోవున్నవారందరికీ ఆత్మ బంధువు
వెన్నలాంటి మంచి మనసున్న మహామనీషి
కల్మషంలేనివాడు కష్టజీవి కరుణామయుడు
వెన్నుపోటుకు అర్థంతెలియని అజాతశత్రువు
తనజీవితాన్ని ప్రజలసేవకే అంకితం చేసినవాడు
మచ్చలేని వ్యక్తిత్వానికి మరోపేరు శివరావుగారు
శివరావుగారంటే సాక్షాత్తు ఆ పరమశివుడే
ఆ శంకరుడు ఆ శ్రీశైలకొండల్లో కొలువైవున్నాడు
స్నేహశీలి ఈ శివరావుగారు మన
అందరి గుండెల్లో ఆసీనుడై వున్నాడు
శ్రీ శైలకొండల్లో నెలకొన్న ఆ అర్థనారీశ్వరున్ని
ఆరాధించేందుకు దర్శించేందుకు దారులు రెండు
ఓం నమశ్శివాయ జపం
ఓం శంభో...శంకర నినాదం
అభిమానుల గుండెల్లో నెలకొన్న
ఈ శివరావుగారు నమ్మిన సిద్ధాంతాలు రెండు
ప్రజాసేవే జీవిత పరమార్ధం
సాటివారికి సాధ్యపడని ఈ జీవితం వ్యర్ధం
ఎంతటి భారమైనా సరే క్రిందికి దూకే
ఆకాశగంగను తలపై భరించగలడా శంకరుడు
సమస్యల సర్పాలనెన్నింటినైనా సరే
సంతోషంగా పూలహారంగా
మెడలో ధరించగలడీ శివరావుగారు
భక్తితో మ్రొక్కిన వారికీ
ముక్తిని ప్రసాదిస్తాడా శంకరుడు
ఆపదలో ఉంటే అభయహస్తాన్ని
అందిస్తాడు ఈ శివరావు గారు
నిత్యం పూజలు చేయాలి
ప్రతినిత్యం హారతిపట్టాలి ఆ శివుడికి
కానీ, ఏ అవార్డులు రివార్డులు
అక్కర్లేదు ఈ శివరావుగారికి
ఇరుగుపొరుగువారిని ఆదుకుంటే చాలు
అదేపదివేలు అంటారు మన శివరావుగారు
మహాత్ములకు ప్రతిరూమైన
ఆదర్శరత్న మన శివరావు గారికి
మంచి ఆరోగ్యాన్ని శక్తి సామర్థ్యాలను
ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని
ఆ పరమాత్మను పార్థిస్తూ...ఆ శివుని
కరుణా కటాక్షవీక్షణాలు కుంభవర్షమై
కురవాలని మేలిమి బంగారమ



