Facebook Twitter
స్నేహ హస్తం + సేవా రత్నం = మూర్తి

"మనం" సేవా సంస్థ  మరియు
"తెలుగు భారతి" సాహితీ సంస్థ అధ్యక్షులు సహృదయులు...స్నేహశీలి...
నిగర్వి...మితభాషి కార్యశూరుడు...కర్తవ్యపరాయణుడు...
ఎందరికో స్పూర్తి ప్రదాత
మా పక్కీరవిశేఖర సత్యనారాయణమూర్తిగారు
చేసిన సామాజికసేవా తత్పరతకు ...
వారి సాహితీ పిపాసకు...
ఎన్నో అవార్డులు...రివార్డులు....
వారి పాదాక్రాంతమయ్యాయి కాదు కాదు..
వారి తలపై కీర్తి కిరీటాలయ్యాయి..
మెడలో పూలహారాలయ్యాయి...
భుజాలమీద...పట్టుశాలువలయ్యాయి...
చేతుల్లో బోకేలయ్యాయి...
వారు మోయలేని మెమొంటాలయ్యాయి...
వారికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి...
ప్రపంచస్థాయిలో వారికి
గొప్ప ప్రశంసాపత్రాలయ్యాయి...
ఎందరో ప్రముఖుల అమృతహస్తాల మీదుగా
అందుకున్న ఎన్నో విశిష్ట పురస్కారాలయ్యాయి...
కలలో కూడా ఊహించని
వారి మిత్రులు సైతం అసూయ చెందేలా
వారి శతృవులు సైతం శెహబాష్ అనేలా 
అనేక సన్మానాలు సత్కారాలయ్యాయి...
ఎందరో కవుల హృదయాల్లో 
సుస్థిర స్థానాలయ్యాయి...
వారివెంటే ఇంటికి వచ్చాయి...
ఇంటికి అలంకారాలయ్యాయి...
వారి మనసును అలరించాయి...
ఇదెంతటి భాగ్యమో
ఏ జన్మ పుణ్యఫలమో కదా లేదా...
వారి అమ్మా నాన్నలు...
శ్రీశ్రీసత్యం కృష్ణ వేణీ పుణ్యదంపతులు

కన్నకలల ఫలమేమోకదా...లేదా...
వారి సహధర్మచారిణి...
శ్రీమతి...శారదమ్మ గారు
చేసినవ్రతాల నోచిననోముల

పుణ్యఫలమేమోకదా లేదా...
పులిబిడ్డగా వారు పుట్టిన బొబ్బిలి
గడ్డ మహత్యమేమో కదా...లేదా
వారి కడుపున పుట్టిన ప్రియపుత్రుడు
చిరంజీవి...సాయీ కుమార్
అదృష్టమేమో కదా...
నేడు వారు ఒకవైపు
ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూ
మరోవైపు కుటుంబ బరువును మోస్తూ
వారి అవసరాలు తీరుస్తూ...
వారి విలువైన సమయాన్ని వెచ్చించి...
వారి ఆరోగ్యాన్ని ‌ఫణంగా పెట్టి...
ఎవరినుండి ఏమీ ఆశించకుండా

నిస్వార్థంగా...అవిశ్రాంతంగా చేస్తున్న
ఈ కృషికి ఈ సేవకు
వారికి అందిన ఆ హాస్య,వికట,
సహస్ర కవి బిరుదులు ఏపాటివి?
అందుకే ప్రభుత్వం తరుపున
ఏదైనా
"విశిష్ట సేవారత్న" బిరుదైనా లేదా
ఏదైనా
ఒక "ఉన్నత పదవివైనా" దక్కాలి...
అప్పుడే వారి "సాహిత్య సేవకు"
సామాజిక నిబద్ధతకు"
వారు చేసిన "త్యాగాలకు"
సంపూర్ణమైన గుర్తింపు...
అది త్వరలో వారికి అందాలని
అందరి అభిమానం వారు పొందాలని...
ఆభగవంతుని ఆశిస్సులు వారికి
నిండుగా మెండుగా
కుంభవర్షమై వారిపై కురవాలని
వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా

ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న...