సరిహద్దుల్లో
మన వీరజవాన్లు
శత్రువుల చేతిలో చిక్కినా
ఘర్షణలో గాయాలౌతున్నా
రక్తం గంగా ప్రవాహమైనా
చివరి రక్తపుబొట్టువరకు దాడిచేసి
వీలైనంతమంది శత్రువులను
చంపుతూ చంపుతూ శ్వాసవదిలిన
నేలకొరిగిన, వీరమరణం పొందిన
భారతమాత పాదాలచెంత
పువ్వులై రాలిపోయిన
కోట్లాదిమంది భారతీయుల
గుండెల్లో ఆరనిజ్యోతులై
వెలుగుతున్నఆ 20 మంది
వీరజవాన్ల ఆత్మలు శాంతించాలని
వారి కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని
తెలియజేస్తూ అశ్రునయనాలతో
అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తు
వారి ఆత్మబలిదానాలు
దేశరక్షణకై వారు చేసిన
ఆ ప్రాణత్యాగాలు వృధాకావని
చర్చలంటూ కుట్రలు కుతంత్రాలతో
నక్కజిత్తులతో వ్యూహాత్మకంగా
దుర్బుద్ధితో మారణాయుధాలతో
ఘోరంగా హింసించి దారుణంగా
నిరాదీయులైన మన సైనికులను
హతమార్చిన హద్దుమీరిన
చైనా దురాక్రమణదారులకు
తగిన రీతిలో బుద్ది చెప్పాలని
పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న
మన వీరజవాన్లు సరైన సమయంకోసం
అధికారుల ఆదేశాలకై ఎదురుచూస్తున్నారు
ఆదేశాలు అందితే మీ ఆత్మలు శాంతిస్తాయి
ఆ మంచుకొండల్లో ఆరని మంటలు రేగుతాయి
యుద్దవిమానాలతో విరుచుకుపడి మన వీరుజవాన్లు
సరిహద్దుల్లో శత్రుసైనికులకు సమాధులు సిద్దంచేస్తారు



