Facebook Twitter
స్ఫూర్తిప్రధాతలు

ఆర్పుకుంటూ

ఆర్పుకుంటూ ఆరని 

కులం కుంపట్లు...

విప్పుకుంటూ

విప్పుకుంటూ

కనిపించీ కనిపించని 

కులం కట్టుబాట్లు...

అనుభవించి

అనుభవించి

అనేక అష్టకష్టాలు 

అగచాట్లు...

ఎక్కారు దిగారు 

జీవితాన ఎన్నో ‌

అధికారపు మెట్లు... 

ఈ కులరక్కసిని

మట్టుబెట్టేందుకు

లెక్కపెట్టకుండా

తమ ప్రాణాలు

ఎక్కపెట్టారు

ఎన్నో పదునైన 

రామబాణాలు

ఈ కుల వివృక్షాన్ని

కూకటివ్రేళ్ళతో సహా

పెకలించి వేయడానికి

చిట్టచివరి శ్వాసవరకు

అవిశ్రాంతంగా 

పోరాటం చేసి

ఆశించే దశ నుండి 

శాసించే దశకు చేరుకున్న 

ఈ శాంతమూర్తులే

ఈ సంఘసంస్కర్తలే

అమరజీవి అంబేద్కర్ 

వారసులందరికి

ఆదర్శమూర్తులు... 

గొప్ప స్ఫూర్తిప్రధాతలు...