Facebook Twitter
కులసర్పాలు...

ఎందుకోఈనేలమీద

కులాలు... మతాలు...

రెండు రావణకాష్టంలా 

రగులుతున్నాయి...

అక్కడ సిరియాలో 

నట్ట నడిరోడ్డు మీద 

పట్టపగలు నరమేధం 

జరుగుతుంది...

ఇక్కడ మన దేశంలో   

కులసర్పాలు పడగవిప్పి 

బుసలుకొడుతున్నాయి... 

క్రూరంగా కాటువేస్తున్నాయి...

మన మేధావులు...మతభోధకులు

సమతావాదులు... సంఘసంస్కర్తలు 

అందించిన కులమత సందేశాలు 

మరుగునపడి పోయాయి...

కవులకలాలు కన్నీరుకారుస్తున్నాయి...

తరతరాలుగా కులసర్పాలను 

కూల్చాలని... కాల్చాలని...

ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా

అన్ని విఫలమౌతున్నాయి...

కులసర్పాలు కంటికి కనపడవు

కారణం... కులసర్పాలను 

బడానాయకులే తమ 

"ఓట్లబుట్టల్లో"... భద్రంగా దాచిపెట్టి

పాలు పట్టి... పెంచి పోషిస్తుంటారు

ఏ పాములవాడు తనకు 

దొరికిన పామును చంపడు... 

ఆడిస్తాడు...ఆకలి తీర్చుకుంటాడు 

అంతే మన నేతలు కూడ...

ఇంతకాలం...

ఈ కులాలఅగ్ని ఆరకపోవడానికి...

ఈ ప్రజలింకా మారక పోవడానికి...

ముఖ్యకారణం కులాలతో ముడిపడిన 

మననేతల... స్వార్థ రాజకీయమే...

అధికార దాహమే...పదవీ వ్యామోహమే...

ఇది మూటికి ముమ్మాటికీ పచ్చినిజమే.....