నాడు రోమా
సామ్రాజ్యాధినేతల
అకృత్యాలను
ప్రశ్నించినందుకు...
తన నీతి బోధనలతో
అమాయకపు ప్రజల్ని
మేల్కొల్పినందుకు...
ఏ పాపమెరుని
పరమపావనుడైన
ఏసుపైన
ఏ నేరం చేయని ఆ
నిర్దోషిపైన నిందలు మోపి...
తలపై ముళ్ళ కిరీటం పెట్టి...
కొరడాలతో దారుణంగా కొట్టి...
అరచేతుల్లో కాళ్ళల్లో
మరమేకులు దింపి
చిత్రహింసలకు గురిచేసి
బహిరంగంగా...శిక్ష వేసి
సిలువపై వ్రేలాడదీసిన ఆ దృశ్యం
కొన్ని వేల
సంవత్సరాలకైనా
మానవాళి మరువలేని
ఒక చారిత్రాత్మకమైన తప్పిదం
గుండెలను పిండే
ఒక విచిత్రమైన విషాద సంఘటన
బైబిల్ లోని
ప్రభువు బోధనలు
మనుషుల జీవితాల్ని
మార్చే మంత్రాలు...
చేసిన పాపాలను కడిగి వేసి...
శాపాల నుండి విముక్తి కలిగించే..
పాపాంధకారాన్ని పారద్రోలే...
ఆరని దారి దీపాలు...
ఆత్మీయ రూపాలు...
సుఖజీవనానికి పునాదులు...
పాపుల కోసమే
ప్రాణాలర్పించిన
ఆ యేసుక్రీస్తు
అభిషిక్తుడు
రాజులకు రాజు
ప్రభువులకు ప్రభువు
పరమపావనుడు ...
పాపుల రక్షకుడు
నరరూపదారుడు
మహిమాస్వరూపుడు...
అద్వితీయ కుమారుడు
శిలువ శిక్షకు బలియై
చిత్రహింసలకు గురియై
కడకు 7మాటలు పలికి
కలువరి గిరిపై కన్ను మూసి
మరణించి మృత్యుంజయుడై...
మూడవదినాన లేచిన ప్రభువైన
ఏసుక్రీస్తు చరణమే ప్రతిపాపికి శరణం



