ఓ ప్రభువా !
ఓ ప్రేమగల మా తండ్రీ !
ఓ దైవకుమారా !
ఓ శాంతి స్వరూపా !
ఓ దయగల దైవమా !
ఓ కరుణామయుడా !
ఓ పరిశుద్ద పావురమా !
గొర్రెలమైన మాకు నీవే...గొప్ప కాపరివి
కుండలమైన మాకు నీవే...గొప్ప కుమ్మరివి
పాపులమైన మాకు నీవే...గొప్ప రక్షకుడివి
రోగులమైన మాకు నీవే...గొప్ప వైద్యుడివి
శత్రువుల చేజిక్కిన నిస్సహాయులమైన
మాకు నీవే...గొప్ప రక్షణదుర్గానివి
మా ఆకలి తీర్చిన...గొప్ప అమ్మవు
మా తప్పులు సరిదిద్దిన...గొప్ప తండ్రివి
బోధనలెన్నో చేసిన...గొప్ప బోధకుడివి
మా కష్టాలను కడతేర్చిన...
మా కన్నీళ్ళను తుడిచిన...
ఒక గొప్ప ప్రాణస్నేహితుడివి
తప్పులెన్నో తెలిసి చేసినా క్షమించి
కప్పలను...క్రూర విషసర్పాల నుండి
కోడి పిల్లలను...ఎగిరే గ్రద్దలు నుండి
మేకలను గొర్రెలను...తోడేళ్ళ నుండి
జింకలను...పులులు సింహాల నుండి
నీ భక్తులను...సైతాను శోధనల నుండి
నీ బిడ్డలను...ఆ మృత్యువు
విషపుకోరల నుండి...కాపాడినట్లు...
నీ ప్రాణాలను శిలువపై ఫణంగా పెట్టి...
నీ పవిత్రరక్తాన్ని కలువరి గిరిపై చిందించి...
రోమన్ సైనికులు పెట్టిన చిత్రహింసలను...
చేసిన అవమానాలను..అవహేళనలను...
చిరునవ్వులతో సహించి...
అనేక బాధలను భరించి...
శరీరం చిట్లి రక్తం చిందేల
కొరడా దెబ్బలెన్నో తిని...
కన్నీరు కార్చి...
మమ్ము కాపాడిన
ప్రేమామయుడివి...
త్యాగధనుడివి తండ్రీ!
అందుకే మీకు వందనాలు...
అభివందనాలు పాదాభివందనాలు...
