అడుగుడి...
మీకు.......ఇవ్వబడును
వెదకుడి...మీకు దొరుకును
తట్టుడి.....మీకు తియ్యబడును
అని ప్రభోదిస్తుంది పరిశుద్ధ గ్రంథం
అడుగు...అడుగు...
అడుగుతూనే వుండు..!
అలసిపోక నీ ఆశలు తీరేంతవరకు...
నీ కోరికలు నెరవేరేంతవరకు...
వెదుకు...వెదుకు...
వెదుకుతూనే వుండు..!
ఒక్క క్షణం అనుమానించక...
ఒక్కఅడుగు వెనక్కి వెయ్యక...
తట్టు...తట్టు...
తడుతూనే వుండు..!
తలుపులన్నీ తెరుచుకునేంతవరకు...
తలపెట్టిన కార్యాలు జరిగేంతవరకు...
కంటూ...కంటూ...
కంటూనే వుండు..! కమ్మని కలలు
కన్న ఆ కమ్మని కలలు పండేంతవరకు...
ఆశించిన ఫలితం నీకు దక్కేంతవరకు...
అన్వేషించు...అన్వేషించు...
అకుంఠిత దీక్షతో అన్వేషిస్తూనే వుండు..!
అంతరంగాన్ని శోధిస్తూనే వుండు..!
ఆత్మప్రబోధాన్ని ఆలకిస్తూనే వుండు..!
ఆచరిస్తూనే వుండు...!ఆఖరి క్షణం వరకు...
ఆపై దివిలోని ఆ దైవం నీపై
కోటి దీవెనలు కుమ్మరించును గాక..!
దీర్ఘాయుష్షును నీకనుగ్రహించును గాక..!
ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించును గాక!



