Facebook Twitter
కన్నీరుకార్చే కర్షకుడు.....

కడుపు కొట్టే వాళ్ళంతా కసాయి వాళ్ళే

గుండెలను చీల్చే అధికారులు 

వెన్నుపోటుతో పొడిచే వారంతా వెర్రివాళ్లే 

గుండెల్ని చీల్చే వాళ్లంతా 

గుండెల్లోగునపాలుగుచ్చే వాళ్ళంతాగుడ్డివాళ్ళే 

అన్నదాత వెన్నువిరిచే వారంతా వెర్రివాళ్ళే

కర్షకులు కడుపుకొట్టేవాళ్ళంతా కసాయివాళ్ళే

రైతన్నల కళ్ళను కన్నీటి సముద్రాలుగా 

మార్చేవాళ్ళంతా మూర్ఖులే

కార్పోరేట్ కంపెనీలకు ఎర్ర తీవాచీ పరచడమంటే

కాకులను కొట్టి గద్దలకు వేయడమే

అన్నం పెట్టి ఆకలి తీర్చే 

అన్నదాత నోట్లో మట్టి కొట్టడమే

అన్నదాత కళ్ళను కన్నీటి 

సముద్రాలుగా మార్చకండి 

కర్షకుల కడుపు కొట్టకండి

అన్నదాత ఆశల మీద నీళ్ళు చల్లకండి

మూడు చట్టాలతో మున్ముందు

ముప్పు ముంచుకొస్తుంది 

ముందే ఊహించిన రైతన్న 

నిన్న ఎద్దులతో పొలందున్నిన రైతులు 

నేడు ట్రాక్టర్లతో రాజధాని నడిబొడ్డున 

రహదారులను దున్నుతున్నారు 

కలుపుమొక్కలను ఏరివేతకు రైతన్నకు తెలుసు 

కొడవలతో పంటలు కోయడం రైతన్నకు తెలుసు