Facebook Twitter
ఊర్లల్లో పశువులు భయపడుతున్నాయి...

ఒకనాడు

ఆ జాతినే ఊరికి 

దూరంగా ఉంచారు

ముట్టుకుంటే ఎక్కడ

మైలపడిపోతామోనని...

ఒకనాడు ఆ జాతినే

దగ్గరకు రానివ్వలేదు

ఎక్కడ వారి నీడ 

మీద పడుతుందోనని....

ఎక్కడ నియమనిష్టలు

కట్టుబాట్లు,ఆచారాలు 

కాలగర్భంలో లిసిపోతాయోనని...

 

కానీ,

మీ పొలాల్లో పశువుల్లా

గొడ్డుచాకిరిచేసింది ఎవర్రా

మిమ్మల్ని కూర్చోబెట్టి

కుబేరులనుచేసింది ఎవర్రా

మీకు చలిలో దుప్పట్లలా

వర్షంలో గొడుగుల్లా

ఎండలో కాలికి చెప్పుల్లా

మీకు నమ్మిన బంట్లగా

మీ ఇంటిల్లిపాదికి 

రాత్రింబవళ్ళు రక్షణకవచాల్లా

ఉన్నదెవర్రా ఈ దళితజాతికాదా?

 

ఒకనాడు

చదువుకుందామనుకుంటే

స్కూల్లోకి రానివ్వలేదు

నీళ్ళుతోడు కోవడానికి

బావులదగ్గరకు రానివ్వలేదు

నీళ్ళు త్రాగడానికి

చెరువుల దగ్గరకు రానివ్వలేదు

చివరకు పండగలకు పబ్బాలకు

భగవంతునికి పూజలు 

చేసుకునేందుకు గుళ్ళలోని రానివ్వలేదు

 

కాని,కాసింతైన కృతజ్ఞత లేకుండా

కొంచెమైనా సిగ్గూలజ్జా లేకుండా

మానభంగాలు చేయడానికి

అభవించడానికి మాత్రం

అందవిహీనమైనా,సరే

దళితజాతి ఆడపిల్లలే 

కావలసివచ్చార్రా మీకు 

ఓ కామాంధుల్లారా !

ఓ కామపిచాశుల్లారా!

కూడుతిని కుండను‌కూడా

పగలగొట్టే ఓ కుక్కల్లారా!

నక్కినక్కితిరిగే

ఓ గుంటనక్కల్లారా!

మీ చెల్లో మీ అక్కో మీ అమ్మో

మానభంగానికి గురైననాడు

 

అప్పుడు తెలుస్తుందిరా మీకు

వారు అనుభవించే ఆ క్షోభ

అప్పుడొచ్చేది మీ కళ్ళలోనుండి 

కన్నీళ్లు కాదురా రక్తం....

ఛీ ! ఛీ ! మీరు మనుషూలారా

కాదు మానవ మృగాలు

అదిగో ఊర్లల్లో పశువులు కూడా

భయపడుతున్నాయిరా,మిమ్మల్ని చూసి

పశువుల్లా మారిన మీరు

తమనెక్కడ మానభంగం చేస్తారోనని.....

ఓ నీచులారా! ఓ నిక్రుష్టులారా!

ఓ దుష్టులారా !ఓ దుర్మార్గులారా!

ఓ ముష్టివాళ్ళారా !ఓ పాపిష్టి వాల్లారా!

ఎప్పుడు మీలోమార్పు వస్తుందో?

అప్పుడేరా ఈ సమాజంలో

మంచితనం మానవత్వం పరిమళించేది.....

ఎప్పుడు మీకు కఠినశిక్షలు పడతాయో?

అప్పుడేరా

ఈ స్త్రీ జాతికి సంపూర్ణస్వేచ్ఛ లభించేది....