Facebook Twitter
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

నారాయణరావు గారి జీవితం క్లుప్తంగా....

జననం  : సెప్టెంబర్ 9,1914
జన్మ స్థలం :రట్టహళ్ళి గ్రామం బీజాపూర్ జిల్లా
స్థిరనివాసం:మడికొండ వరంగల్ జిల్లా
తల్లి దండ్రులు: రమాబాయమ్మ ,రంగారావు
భార్య: రుక్మిణి బాయి
కుమారుడు:రవికుమార్
మరణం:నవంబర్ 13, 2002
విశిష్ట పురస్కారం : 1992లో పద్మ విభూషణ్
విశిష్ట రచన: "నా గొడవ"ఖండకావ్యం

"ఏ భాష నీది ఏమి వేషమురా/

ఈ భాష ఈ వేషమెవరి కోసమురా/

ఆంగ్లమందున మాటలనగానే/

ఇంత కుల్కెదవెందుకురా/

తెలుగువాడివై తెలుగు రాదనుచు/
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా/

అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు/

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!"
అన్న కాళోజీగారికి తెలుగు భాషపై మమకారమెక్కువ.

"నాది బడి పలుకుల భాష కాదు. పలుకుబడుల భాష..
నా మాతృభాష తెలుగు"అంటూ తెలంగాణ పలుకుబడితో

ప్రజల మాటను, వ్యధలను వ్యక్తంచేసిన తీరు అద్భుతం

"పుటుక నీది /చావు నీది/ బతుకు దేశానిది.
అన్యాయాన్నెదిరిస్తే/నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే/నా గొడవకు ముక్తి ప్రాప్తి,
అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు’ అని
ఏళ్లుగా గుర్తింపులేని తెలంగాణ భాషను, సంస్కృతీ..

సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసినకవి కాళోజీ

తెలంగాణ యాసే నా శ్వాసన్న కాళోజీ నారాయణరావుగారి

జయంతిని(సెప్టెంబర్ 9)" తెలంగాణ భాషా దినోత్సవంగా"

జరుపుకోవడం తెలుగుజాతికే గర్వకారణం.ఈ భాషను
ఈ యాసను బ్రతికించుకోవడమే మనం వారికిచ్చేగౌరవం