Facebook Twitter
అక్షరాలసాక్షిగా..

ఆ సరస్వతిదేవికి ప్రణమిల్లి

నీతిగా...

నిక్కచ్చిగా... 

నిస్వార్ధంగా... 

నిర్భయంగా... 

నిజాయితీగా... 

నిష్పక్షపాతంగా...

నిర్మొహమాటంగా...

అక్షరమే ఆయుధంగా...

పాఠకుల చైతన్యమే 

పరమ ధ్యేయంగా...

ప్రజాసంక్షేమమే 

అంతిమ లక్ష్యంగా... 

నవసమాజ నిర్మాణమే 

ఆఖరి ఆశయంగా... 

 

పత్రికా రంగంలో...

ప్రజా పక్షపాతిగా...

ప్రజలహక్కులను కాలరాచే 

ప్రభుత్వాలను హెచ్చరిస్తూ 

ప్రజాసమస్యలకు చక్కని

పరిష్కారమార్గాలను చూపుతూ 

ప్రభుత్వాధినేతలను ప్రశ్నిస్తూ

ప్రభుత్వానికి...ప్రజలకు...

మధ్య ఒక వారథిగా...

విలువలకు కట్టుబడి 

వివాదాలకతీతంగా...

 

"సాహితీ సాగరంలో...

ఎగిసిపడే...అపార్థాల అలలను

ఎదురయ్యే... ఆటుపోట్లను

తగిలే... ఎదురుదెబ్బలను 

వచ్చే...కష్టనష్టాలను తట్టుకుంటూ 

అవాంతరాలను అవరోధాలను...భరిస్తూ

విరుచుకుపడే...

సవాళ్ళను సమస్యలను...సహిస్తూ... 

సిబ్బందికి ఏ‌ఇబ్బంది రాకుండా...

 

"పత్రికా పడవను"ప్రశాంతంగా 

నవ్వుతూ నడిపించి "ఆవలితీరం" చేర్చే

సమర్థులు సహృదయులు గౌరవనీయులైన 

సంచలనాలకు మారుపేరైన "జనదీపిక" దినపత్రిక

"సంపాదక శిఖామణి" శ్రీ చిన్నారావు గారికి

ఈ ప్రజాపత్రిక దినదినాభివృద్ధి చెందాలని 

ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదగాలని

ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ...

"ఐదవ వార్షికోత్సవ" శుభాకాంక్షలు‌ తెలియజేస్తూ.