సాహిత్యసారథి
విభిన్నశీర్షికల వారథి
మన "దిక్సూచి" మాసపత్రిక
ఔనిది నిజం పచ్చినిజం
గులాబీలా గుభాళిస్తుంది
మంచిగంధంలా మందారంలా
మల్లెపువ్వులా పరిమళిస్తుంది
చిలిపిగా చిరునవ్వు నవ్వుతూ
చిలకలా పలికి నెమలిలా కులికి
అందరి మనసులను దోచుకుంటుంది
ఊరించిఊరించి కలలో ఊహలఊర్వశిలా
విలువైన విజ్ఞానదాయకమైన
విభిన్నమైన వింత వింత శీర్షికలతో
నెలనెలా మనకు కనువిందు చేస్తుంది
అందరి కడుపులు నింపుతుంది ఈ బాంబేబేబి
ఎంకిలా పదహారణాల తెలుగు ఆడపడుచులా
ఒక అమృతమయి అమ్మలా ఒక అన్నపూర్ణలా
రవివర్మ వర్ణచిత్రంలా బాపుబొమ్మలా అందరిని
అలరిస్తుంది అందాల మాసపత్రిక మన దిక్సూచి
Our "Dikshoochi"
Monthly online Magazine is
Beautiful because of its Pics
An Attractive because of its Print
Fantastic because of its Literary works
Amaging because of its Decent Designing
తమ Excellent Team సహకారంతో
తెలుగు భాషా వికాసానికై నిరంతరం నిర్విరామంగా
శ్రమిస్తున్న పత్రికా "రథసారథులు", కళాపోషకులు
శ్రీ బండినారాయణరెడ్డి శ్రీ మాదిరెడ్డికొండారెడ్డి
గౌ.సం.శ్రీ సంగెవేని రవీంద్ర గార్ల సారధ్యంలో
దినదినాభివృద్ధి చెంది ఎవరెస్టు ఈఫిల్ టవరంత
ఎత్తుకు ఎదగాలని శాంతి శిఖరమై కాంతికిరణమై
తెలుగునేలపై తేనెలవానలు కురిపించాలని
విజ్ఞానపు విద్యుత్ కాంతులు వెదజల్లాలని
ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మనసారా కోరుకుంటూ
అందిస్తున్న అక్షరాభినందన మందార మకరంద మాల



