ఏది కాకినాడ కాజాలా...
పసందుగా...
బంగారు బాపుబొమ్మలా...
కనువిందుగా...
పంచరంగుల రామచిలుకలా...
అందంగా అతిమనోహరంగా.
ఏడురంంగు ఇంద్రధనుస్సులా...
కడురమణీయంగా...
ఉండునో ఊరించునో
అలరించునో అదే అదే మన
దీపాల వెలుగుల దిక్సూచి
అంతర్జాల తెలుగు మాసపత్రిక
కొంటే కంచి ధర్మవరం...
పట్టుచీరలే కొనాలి...
తింటే హైదరాబాద్...
దమ్ముబిర్యానే తినాలి...
వింటే అమరగాయకుడు...
ఘంటసాల పాటలే వినాలి...
చదివితే దీపాల వెలుగుల దిక్సూచి...
అంతర్జాల తెలుగు మాసపత్రికనే చదవాలి...
దిక్సూచి అంటే...
బొంబాయి నగరంలో పుట్టి
ప్రపంచమంతా తిరిగే పాలపిట్ట
దిక్సూచి అంటే...
తెలుగు ప్రజలకు దొరికిన తేనెపట్టు
దిక్సూచి అంటే...
తేనేలూరే తెలుగు అక్షరాల అనుబంధం
దిక్సూచి అంటే...
విజ్ఞానపూరిత వినోద భరిత విలువైన
వినూత్నమైన శీర్షికల మందార మకరందం
దిక్సూచి అంటే...
తెలుగుభాషను తెలుగుజాతి ఖ్యాతిని
ఖండాంతరాలకు ప్రసరించే వెలుగుకిరణం
దిక్సూచి అంటే...
తెలుగుసంస్కృతి సంప్రదాయాల సమాహారం
దిక్సూచి అంటే...
పప్పు అవకాయ షడ్రుచుల అరిటాకుభోజనం
ఈ దిక్సూచి మాసపత్రిక
గౌ.శ్రీ కొండారెడ్డిగారి ఈ మానసపుత్రిక
దినదినాభివృద్ధి చెంది తెలుగుభాషాపరిమళాన్ని
ప్రపంచమంతా విరజిమ్మాలని
తెలుగు కళా సమితి నిస్వార్థ సాహితీసేవలు
తెలుగుజాతి గుండెల్లో చెరగని తరగని
తీపిజ్ఞాపకాలుగా మిగిలిపోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ...



