కవులతో పెట్టుకుంటే?
కవులు కరుణామయులు
కంటబడితే మంచి లక్షణాలు
వెంటనే మహాత్ములంటారు
మహారాజులంటారు
మంచి మంచి మాటలతో
ఇంద్రుడంటారు శ్రీరామచంద్రుడంటారు
పొగడ్తలతో ముంచెత్తుతారు
అదే ఏదైనా చెత్త చెడులక్షణం
ఒకటి కంటికి కనిపిస్తే చాలు
చెవులకు వినిపిస్తే చాలు
కత్తిలాంటి కవితలతో
మెత్తగా రోజు గుట్టుగా
గుండెల్లో గునపంలా
గుచ్చుతూనే వుంటారు
మనిషిగా మారేదాక
ఆ మనిషిలో మంచితనం
మానవత్వం వికసించేదాక
కొందరు కంటిచూపుతో చంపుతారు
కవులు మాత్రం కత్తిలాంటి
కవితలతోనే చంపేస్తారు
అందుకే
కవులతో పెట్టుకోకండి ప్లీజ్



