ప్రజా నేత్రం...దినపత్రిక
అది...
ఒంపుసొంపుల...
వలపుచూపుల...
బాపు గీసిన "బంగారు బొమ్మా" ?
కాదు కాదు అంతకన్నా మిన్న...
అది మదినిదోసే అందాల
ఆనందాల "చందమామా" ?
కాదు కాదు అంతకన్నా మిన్న...
అది మురిపించే మైమరపించే
ముచ్చటగొలిపే "ముత్యాల ముగ్గా" ?
కాదు కాదు అంతకన్నా మిన్న...
మరైతే అదేమిటి?
అదే విభిన్న వార్తల "విరిజల్లు"
అదే కమ్మని వార్తల "హరివిల్లు"
అదే కంటికింపైన
రమణీయ రంగుల్లో
అందరిని అలరించే
మన దినపత్రిక "ప్రజా నేత్రం"
అది ఒక "నవజీవన సూత్రం"
వింతల విశేషాల "విజ్ఞానక్షేత్రం"
ప్రజావాణికి అది "ప్రతిబింబం"
వేడి వేడి వార్తాకథనకిరణాలను
శుభకర సుందర "సూర్యబింబం"
మానవీయతకు "మంగళతోరణం"
నీతి నిజాయితీకి "నిలువెత్తునిదర్శనం"
అదే "మన నేస్తం" మనకు "అభయహస్తం"
పాఠకులనలరించే "అక్షరాల అక్షయపాత్ర"
అదే అదే మన "ప్రజానేత్రం" దినపత్రిక....



