తెలుగు కవులందరికి పెద్దపీట వేస్తున్న
మన CEO బ్రహ్మయ్యాచారి గారి
"మానస పుత్రిక" మన "ఉదయం దినపత్రిక"
ప్రతిరోజు సర్వాంగ సుందరంగా
చూడముచ్చటగా "బాపుబొమ్మలా"
పదహారణాల "తెలుగింటి ఆడపడుచులా"
ముస్తాబై మన ముంగిట్లో దర్శన మిస్తుంది
ముత్యాల ముగ్గులా అందరినీ అలరిస్తుంది
గుభాళించే గులాబి పువ్వుల్లాంటి కమ్మనైన
కవితలతో కవులందరినీ పరవశింపజేస్తుంది
అది "ఉదయమే" ఉదయించే"సూర్యోదయమే"
అది బ్రహ్మయ్యాచారి గారి విశాల"హృదయమే"
కవుల హృదయాలను దోచుకునే"కవనకిరణమే"
మన "సాహితీ కవనాల" శీర్షిక
ఉదయం పత్రికకే ఒక "వజ్రకిరీటం"
రమణీయమైన రంగుల "హరివిల్లు"
మనసులను ఉల్లాసపరిచే "విరిజల్లు"
అది బ్రహ్మయ్యగారు కవులకు ప్రేమతో
అందించే పసందైన "కమ్మని కవితలవిందు"
అందుకే అనునిత్యం
నిస్వార్థంగా నిష్పక్షపాతంగా
అందరి కవితలను ఆదరిస్తున్న
ఎందరో కవులను ప్రోత్సహిస్తున్న
ఓ అభినవ రాయల వారసుడా !
ఓ కళాపోషకుడా ! ఓ సాహితీ స్నేహితుడా !
ఓ ఉదయం దినపత్రిక సంపాదక శిఖామణీ!
అందుకో అందుకో మా వందనాలు ! అభివందనాలు!
మీకివే మా మందారమకరంద కృతజ్ఞతాకుసుమాంజలులు!



