ఓ కవివర్యా !
ఆడపిల్లలను
అల్లరిచేసి ఆటపట్టించే
పోకిరి పోరగాళ్ళమీద
ఛెళ్ళుమని ఝలిపించాలి
మీ కవితల కరాలవాన్ని...
ఖణఖణ మండే
మీ కవితాక్షరాలు "చురకలే"
చుర్రుమనిపించే "చురకత్తులే"...
"చెడు" చేసిన వారికి
"చెంపదెబ్బలే"...
"తప్పు" చేసిన వారికి
"చెప్పుదెబ్బలే"...
వావీ వరసలేక
వయసు భేదం ఎరుగక
ఎరవేసే పోరగాళ్ళకు
"ఒంటినిండా వాతలే"...
దారితప్పుతున్న యువతకు
కళ్ళు బైర్లు కమ్మించేది
కనువిప్పు కలిగించేది
"మీ కమ్మని కవితలే"...
చేపపిల్లల కోసం
చెరువు గట్టున
కొంగల్లా,దొంగజపం చేస్తూ...
మాయమాటలతో మత్తెక్కిస్తూ...
అభంశుభం తెలియని
"అబలల మీద"...
మాయామర్మం ఎరుగని
"మగువల మీద"...
అఘాయిత్యాలకు పాల్పడే
ఈ కౄరమైన "మానవ మౄగాలపై"
కత్తిలాంటి పదునైన
మీ కవితా పదబాణాలతో
"మెరుపుదాడి" చెయ్యాలి
వారి "చూపులను" శుద్ది చేయాలి
వారి "మనసులను" మార్చివేయాలి
వారి "హృదయాలను" గెలవాలి
వారి "కళ్ళకున్న గంతలు" విప్పాలి
వారికి "కనువిప్పు"కలిగించాలి ఓ కవివర్యా!



