Facebook Twitter
నేను నా కవిత్వం...

నా మాటలు...

తేనెల ఊటలు ...

ముత్యాల మూటలు... 

నా మాటలు పదునైన ఈటెలు...

నట్టేటముంచే నయవంచకుల గుండెల్లో 

గురిచూసి విసిరే "రామబాణాలు"

మంచిని పంచే మనిషి మనిషిని ప్రేమించే  

ప్రేమమూర్తులకు "రక్షణ కవచాలు"

 

నా కలం...

పేదలకు అనాధలకు పీడిత తాడిత 

బడుగు బలహీనవర్గాలకు "కొండంత బలం"

నా కలం... 

నుండి ప్రవహించేది స్వచ్ఛమైన "గంగా‌జలం" 

 

నా అక్షరాలు... 

నువ్వే నక్షత్రాలు

విషం చిమ్ము విమర్శకులకు 

విదూషకులకు శిక్షలు వేస్తాయి

సంఘసంస్కర్తలకు సెల్యూట్ చేస్తాయి

అణచివేయబడితే ఆయుధాలౌతాయి

 

నా కవితలు... 

ఆరిపోని "కొవ్వొత్తులు"

వాడిపోని గులాబీ "పూలగుత్తులు"

అంధుల కామాంధుల మతోన్మాదుల

తలలపై వ్రేలాడే పదునైన "చురకత్తులు"

 

నా కవిత్వం...

విజ్ఞాన పూరిత వినోద భరిత

విశ్వ శ్రేయస్సును ఆకాంక్షించే

శుభసందేశాల "సుందర నందనవనం"

 

నా కవిత్వం...

వినోదానికి‌ విషాదానికి 

విషానికి అమృతానికి తేడాలను తెల్పు

మూర్ఖులను దుర్మార్గులను మేలుకొల్పు

 

నా కవిత్వం...

స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు  

దాతృత్వానికి దైవత్వానికి

మంచితనానికి మానవత్వానికి 

సమానత్వానికి సౌభ్రాతృత్వానికి "స్ఫూర్తి"