రాజీమార్గమే రాజమార్గం...
అడగవద్దు, అలగవద్దు
ఆశించవద్దు, దూషించవద్దు
శోధించవద్దు, సోకించవద్దు
సాధింపులువద్దు, వేధింపులువద్దు
అదిరింపులువద్దు, బెదిరింపులువద్దు
అర్ధంలేని ఆంక్షలు అసలేవద్దు
నేడే మీది రేవు మీది కాదు కాదు
వారిది పచ్చగా ఎదిగే మొక్కల జీవితం
మీది వాడిన అరటి తొక్కల జీవితం
అరుపులువద్దు, విరుపులువద్దు
ఉరుములు మెరుపులువద్దు
వారి ముందు బ్రతుకు నిండుపౌర్ణమి
మీ ముందు బ్రతుకు చిమ్మచీకటి
గర్జనలువద్దు, ఘర్షణలువద్దు
గాండ్రింపులువద్దు, గద్దింపులువద్దు
వారికి ఇంటినిండా డబ్బులు
మీకు ఒంటినిండా జబ్బులు
వారికెరుకే మీరు
కోరలులేని పులులని
మూలిగే ముసలి నక్కలని
మొరిగే పిచ్చిశునకాలని
మరి ఓటమి ఖాయమని తెలిసీ
యుద్దానికెెందుకు సిద్ధమౌతారు ?
దేనికి క్రుంగిపోవద్దు, పొంగిపోవద్దు
స్థిరచిత్తం, మౌనవ్రతం, రాజీమార్గమే ఉత్తమం........ఉత్తమం......ఉత్తమం



