తప్పదని తెలిసినా కూడా ...
పుట్టిన తర్వాత గిట్టక తప్పదని తెలిసినా
ఆస్తులు ఆర్జిస్తారు ఎంతో ఆశతో జీవిస్తారు
ఆలుమగలబంధాలు అశాశ్వితమని దూరంకాక
తప్పదని తెలిసినా ఆలి మెడలో తాళి కడతారు
ఇక్కడే అన్నీ వదలి వెళ్లిపోక తప్పదని తెలిసినా
కోట్ల ఆర్జిస్తులార్జించి ఖరీదైన కొంపలు కడతారు
వెంట ఎవరూ రారని ఒంటరి ప్రయాణం తెలిసినా
బంధువులంటారు ఇంటినిండా పిల్లల్ని కంటారు
నేడో రేపో నగ్నంగా వెళ్లిపోక తప్పదని తెలిసినా
బ్రాండెడ్ బట్టలంటారు బంగారునగలు కొంటారు
తెలిసీ తెలీక పాపంచేస్తే కఠినశిక్షలు ఉంటాయన్నా
తప్పులు చేస్తుంటారు తప్పటడుగులు వేస్తుంటారు
మరుజన్మలేదన్నా భక్తితో దేవుణ్ణి మొక్కుతుంటారు
ఎందుకంటె ముందు జన్మలో ముక్తికోసమేంటారు



