ఏలనోయ్ నీ కింత ఆశ?
ఏలనోయ్ ఏలనోయ్ అన్నీ
శాశ్వతమని తలచేవు
నాది నాది అనుకున్నది
ఏదీ నీదికాదన్న
నిజం తెలిసినా
అంతులేని ధనాన్ని
ఎలరా ఆర్జించేవు?
నీవు అనుభవించక
ఆకలికి అలమటిస్తూ
అస్థిపంజరాలై నీచుట్టే
నీ కళ్ళముందరే తిరిగే
ఆ అభాగ్యులకింత పంచక
కన్నుమూసిన మరుక్షణమే
నీ ప్రయాణం పరలోకానికేగదరా
నీ కష్టార్జితం పరులపాలే గదరా
ఈ భూమిపైన
ఈ భోగభాగ్యాలు
ఈ సిరి సంపదలు
ఈ కళ్ళు తిరిగే ఖరీదైన విల్లాలు
ఈ బ్రాండెడ్ బట్టలు
ఈ బంగారు ఆభరణాలు
ఈ విలాసవంతమైన జీవితాలు
ఈ కోట్ల వ్యాపారాలు
వాటితాలూకు,
ఆ ఆనందం ఆ అహంకారం
నీ బొందిలో ప్రాణమున్నంత వరకేరా
అన్నీ అశాశ్వితమేరా
కలలో కనిపించిన కోట్లు
కళ్ళు తెరవగానే
కరిగిపోయినట్టురా
మేలు కొన్నమరుక్షణమే
మాయమైపోయినట్టురా
నీటిమీద బుడగలు
నిముషమే నిలుచినట్టురా



