Facebook Twitter
మనందరం కోటీశ్వరులమే ఎలా ? ఇదిగో ఇలా?

భువిలో

మనుషులు

అందరూ శ్రీమంతులే

అందరూ కోటీశ్వరులే

అందరూ ధనవంతులే

అందరూ ప్రయాణికులే

బహుదూరపు బాటసారులే

కారణం ఈ నేల మనకొక అద్దెకొంప

 

మీకు రోజు నిద్ర లేవగానే ఆదైవం

24 గంటల సమయం ఇచ్చాడంటే

ఒక్కో గంట విలువ ఒక కోటీ ఐతే.........

మీరు ప్రతిరోజు 24 కోట్ల ఆస్తిపరులేగా!...

మీ "బ్రతుకుఖాతాలో" 24 కోట్లు వున్నట్లేగా...

 

మీరు 60 సంవత్సరాలు జీవించి

ష్షష్టిపూర్తి చేసుకున్నారనుకుంటే.............

ఒక్కో సంవత్సరం విలువ ఒక కోటి ఐతే

మీరు 60 కోట్ల ఆస్తిపరులేగా !...

మీ "జీవననిధిలో" 60 కోట్లు వున్నట్లేగా...

 

మీకు సంతానం 3 గురుఅబ్బాయిలు

3గురు అమ్మాయిలైతే ఆరుమంది పిల్లలైతే

ఒక్కో బిడ్డ విలువ 100 కోట్లు అనుకుంటే.....

నేడు మీరు 600 కోట్ల ఆస్తి పరులేగా!...

మీ "ఫ్యామిలీ ఫండ్ లో" 600 కోట్లు వున్నట్లేగా...

 

ఐతే ఎవరు ఎన్నిలెక్కలు గట్టినా

ఎవరూ లెక్కగట్టలేనిది ఒక్కటే మీప్రాణమే

గణిత శాస్త్ర పండితులకైనా అర్థం కానిది

ఏ సూపర్ కంప్యూటర్ కైనా సాధ్యం కాదని

ఏ మనిషి మేధస్సుకు అందనిది

ఎవరూ లెక్కించలేనిది

విలువకట్టలేనిది అతిఖరీదైనది

ప్రపంచంలో డబ్బునంతా

కుప్పగాపోసినా తులతూగనిది మీ ప్రాణమే

 

మరి ఈ ప్రపంచంలో మీకన్న కుబేరులెవరు?

మీరు భక్తి పరులైతేనే మీ శక్తి మీకు తెలిసేది.......

మీరా శ్రీహరిని నమ్మితేనే 

ఆయనకు గుండెల్లో గుడికడితేనే

మీరెంతటి శ్రీమంతులో మీకు అర్థమయ్యేది.......