నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
అమ్మా నాన్నలు ఆశపడ్డారు కాబట్టే
ఆ యిద్దరు ప్రేమతో కలిశారు కాబట్టే
కనిపించని ఆదైవం కరుణించాడు కాబట్టే
వారి కడుపున మనం పుట్టాము కాబట్టే
ఈ లోకంలోకి అడుగు పెట్టాము కాబట్టే
బ్రతికి ఈ నేలమీద బట్టకట్టాము కాబట్టే
పైనుండి పిలుపు వచ్చింది కాబట్టే
కన్నుమూసి కట్టెగా మారాము కాబట్టే
ఆర్జించినవన్నీ వదిలి పెట్టాము కాబట్టే
కట్టెల మీద పెట్టి మనల్ని కాలుస్తున్నారు
గోతిలో పెట్టి పూడుస్తున్నారు లేకుంటే
ఏ కాకులకో ఏ గద్దలకో విసిరేసే వారు
నన్నునిన్ను మానవత్వంలేని ఈ మనుజులు
నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
కన్నబిడ్డలనైనా, కట్టుకున్న భార్యనైనా
కడకు బంధువులనైనా,నాఅన్నవారినెవరినైనా
బంధాలేవైనా బ్రతికున్నంత వరకే
ఈ నేల మనందరికి ఒక అద్దెకొంప, కన్ను
మూయకతప్పదు కొంప ఖాళీ చేయకతప్పదు
ఎవరూ నీవారు కారు, ఏదీ నీ వెంట రాదు
అంతా పిచ్చిభ్రమ అంతా మాయమచ్చీంద్ర



