Facebook Twitter
నీవు బాగుండాలంటే....

నీవు బాగుండాలంటే
నీవు ఒక శిశువులా వుండాలి
పాలిచ్చే ఓ పశువులా వుండాలి
 

నీవు బాగుండాలంటే

పిల్లికి బిక్షంపెట్టని ఓ పిసినారిలా కాదు

దయాగుణం గల ఓ దాతలా వుండాలి

 

నీవు బాగుండాలంటే

పాషాణహృదయుడైన ఓ దానవుడిలా కాదు

కరుణ జాలి ప్రేమ గల ఓ దేవుడిలా వుండాలి

 

నీవు బాగుండాలంటే

నీవెప్పుడూ నిప్పులా మండుతూ వుండాలి

నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా వుండాలి

 

నీవు బాగుండాలంటే

నీవెప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ వుండాలి

నీవెప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా వుండాలి

 

నీవు బాగుండాలంటే

నీవెప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండాలి

నవ్వులపాలైపోక నవ్వుతూ నవ్వుతూనే వెళ్ళిపోవాలి

 

నీవు బాగుండాలంటే

నీవు గొప్ప సహనం సర్దుబాటు గుణం కలిగి వుండాలి

నీ మనసు మంచితనం మానవత్వంతో నిండివుండాలి

 

నీవు బాగుండాలంటే

కోపం ద్వేషం లేక ఎవరితో శతృత్వం లేకుండా వుండాలి

ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా వుండాలి