ఎక్కడ గుడి ఉంటుందో
అక్కడ గంట వుంటుంది
ఎక్కడ నక్క వుంటుందో
అక్కడ గుంట వుంటుంది
ఎక్కడ పొలముంటుందో
అక్కడ పంట వుంటుంది
ఎక్కడ పెళ్లి జరుగుతుందో
అక్కడ జంట వుంటుంది
ఎక్కడ పొగ ఉంటుందో
అక్కడ నిప్పు వుంటుంది
ఎక్కడ వెలుగు ఉంటుందో
అక్కడ నీడ ఉంటుంది
ఎక్కడ భక్తి ఉంటుందో
అక్కడ ముక్తి ఉంటుంది.
ఎక్కడ ప్రయత్నం ఉంటుందో
అక్కడ ఫలితముంటుంది
ఎక్కడ శ్రమ ఉంటుందో
అక్కడ సంపద ఉంటుంది
ఎక్కడ పట్టుదల ఉంటుందో
అక్కడ విజయముంటుంది
ఎక్కడ చెట్టు ఉంటుందో
అక్కడ వేరు వుంటుంది
ఎక్కడ దారి ఉంటుందో
అక్కడ ఊరు ఉంటుంది.
ఎక్కడ చెరువుంటుందో
అక్కడ చేప ఉంటుంది.
ఎక్కడ ధనము ఉంటుందో
అక్కడ దొంగతనముంటుంది
ఎక్కడ చిమ్మచీకటి ఉంటుందో
అక్కడ వెన్నెలవెలుగుంటుంది
ఎక్కడ ఆవేశముంటుందో
అక్కడ అవమానముంటుంది
ఎక్కడ ఆందోళన ఉంటుందో
అక్కడ పొరపాటు ఉంటుంది.
ఎక్కడ తొందరపాటు ఉంటుందో
అక్కడ పెనుప్రమాదం పొంచి వుంటుంది
ఎక్కడ మంచితనముంటుందో
అక్కడ మానవత్వముంటుంది
ఎక్కడ అజ్ఞానం అమాయకత్వముంటుందో
అక్కడ అసమానత అణిచివేత ఉంటుంది
ఎక్కడ సహనం సర్దుబాటుగుణం ఉంటుందో
అక్కడ సుఖము శాంతి సమాధానముంటుంది



