అందమైన అల కమ్మని కల....
జీవితం చాలా చిన్నది
నేడున్నది రేపు లేకున్నది
ఉన్నతమైనది ఉత్కృష్టమైనది
అంతలోనే కనపడి
అంతలోమాయమయ్యే
"నీటి బుడగ జీవితం"
అంతలోనే పైగెగసి
అంతలోనే పడిపోయే
"అందమైన అల జీవితం"
అంతలోనే పుట్టి
అంతలోనే కరిగి పోయే
"కమ్మనికల జీవితం"
బ్రతుకు భద్రం
భయబ్రాంతులు వ్యర్థం
తెలుసుకో జీవిత పరమార్ధం
ధైర్యంతో
ముందుకు సాగిపోతే
నందనవనం
"నవరసభరితం ఈ నరలోకం"
పరమాత్మను
స్మరిస్తూ తనువు చాలిస్తే
పరమానందం
"పరమపావనం ఆ పరలోకం"
ఇది ఒక నిత్యసత్యం ఇది అందిన ఆణిముత్యం
అన్నపోలన్న సుభాషితం విన్నమీకు శుభోదయం



