మీరు..
మీ అంతర్వాణి...
ఓ మైడియర్ డార్లింగ్ !
భర్త అనే నేను భార్యా అనే నీకు
అందరిలో పెళ్లిపందిరిలో
మూడుముళ్ళు వేసి
ఏడు అడుగులు నడిచి
పంచభూతాల సాక్షిగా
పెళ్ళినాడు చేసిన ఆ
ప్రమాణాలను మరువనని
నీ చేయి ఎన్నడూ విడువనని
నేడు మళ్ళీ ప్రమాణం చేస్తున్నాను
మీరు...
మీ అంతర్వాణి...
ఓ మైడియర్ డార్లింగ్ !
నీ కొండంత ప్రేమను
నా గుండెనంతా నింపుకొని
నా గుండెగుడిలో నీకు గుడికట్టి
నిన్ను ఒక దేవతగా కొలుస్తానని...
మీరు...
మీ అంతర్వాణి...
ఓ మైడియర్ డార్లింగ్ !
నీ నుదుటికి బొట్టునౌతానని
నీ కాలికి మెట్టెనౌతానని
నీ చేతికి గాజునౌతానని
నీ ముక్కుకి పుడకనౌతానని
నీ బుగ్గకు చుక్కనౌతానని
నీ పెదవిపై చిరునవ్వునౌతానని
నీ మెడలో పూలహారమౌతానని
నీ సిగలో సిరిమల్లె నౌతానని
నీ కడుపులో బిడ్డనౌతానని
మీరు...
మీ అంతర్వాణి...
ఓ మైడియర్ డార్లింగ్ !
నీ కష్టాలలో కన్నీళ్ళలో
నీ సుఖదుఃఖాలలోనీకు నీడగా
కొండంత అండగా ఉంటానని
నీ కంటికి వెలుగు నౌతానని
నిన్ను కంటికిరెప్పలా
కాపాడుకుంటాని
కాటికైనా నీ వెంటే నడుస్తానని
చితిలో సైతం నీవెంటే వుంటానని
కాలిబూడిద నైపోతానని
నీవు నాకు ఆభగవంతుడిచ్చిన
ఒక బంగారు బహుమతియని
మీరు...
మీ అంతర్వాణి...
ఓ మైడియర్ డార్లింగ్ !
నీవు అన్నావు
ఓ ప్రియతమా నీవు నాకు ఎన్నో నోములపంటని జన్మజన్మలకు
నీకే భార్యనై ఉంటానని
అందుకే ఓ ప్రియా నేనంటున్నాను
నీవు నాకు ఎన్నో జన్మల
పుణ్యఫలమని
నాకు నీవు జతకావడం
నా పూర్వజన్మ సుకృతమేనని
నేడే ఆ భగవంతుడికి
ఒక దరఖాస్తు చేసుకుంటున్న
జన్మజన్మలకైనా "విడిపోని జంటగా"
మన ఇద్దరిని ముడివేయమని...



