దైవందీవించిన దంపతులెవరు?
పేదలపై ప్రేమ జాలి
మెండుగా కురిపించే
మంచితనం, మానవత్వం
సహనం, సర్ధుబాటుగుణం
అన్న నాలుగు సద్గుణాలున్న
అవే మా ఆరోప్రాణమన్న
అభ్యుదయ భావాలున్న
ఆలూమగలే..............
కలతలు కన్నీళ్లు లేకుండా
సుఖసంతోషాలతో చల్లగా
ప్రశాంతంగా కాపురం చేసే
భార్యా భర్తలే..............
బ్రహ్మ జతచేసిన
బంగారు జంటలు
ఆరని ఆశా దీపాలు
ప్రేమకు ప్రతిరూపాలు
అందరికీ ఆదర్శప్రాయులు
ధర్మదాతలు
దైవస్వరూపులు
దయార్ద్ర హృదయులే
దైవం దీవించిన దంపతులు, వారే
ఉన్నదాంతో తృప్తిచెందే ఉత్తములు



