Facebook Twitter
నేటి నిజం దినపత్రిక

*నే*-  ను అనే అహంకారాన్ని త్యజించు, తో

 

*టి* - వారిని, సాటివారిని, సహోదరులుగా భావించు,

 

*ని*- జాయితీగా, నీతిగా, నిస్వార్థంగా జీవించు, ని 

 

*జం*- నిప్పులాంటిదని, గ్రహించు, దహించి వేస్తుందన్న సత్యాన్ని గుర్తించు 

 

*ది* - గులును దిగమింగు, బాధలను భరించు

 

*న* - వ్వు నలుగురిని నవ్వించు, పదిమందిని ప్రేమించు

 

*ప* - రమాత్మను ప్రతినిత్యం ధ్యానించు, పగలు, రా

 

*త్రి*- భక్తితో ఏకాగ్రతతో ప్రార్థించు, సదా స్మరించు

 

*క*- ర్త కర్మ క్రియయైన పైవాడు, దివినుండి నిన్ను దీవించు

 

*ర*- మణీయమైన రంగులప్రపంచంలో స్వేచ్ఛగా విహరించు

 

*చ*- రిత్రను సృష్టించు, చిరంజీవిగా మిగిలిపో

 

*న* -వ సమాజాన్ని నిర్మించు, భారతమాత గర్వించు

 

*కె* - రటం నీకు ఆదర్శం కావాలి, పడినందుకు

         కాదు,పడినా తిరిగి పైకి లేచినందుకు.

 

*పో*-రాడు, పోరాడితే పోయేదేముంది?

         నీ బానిస బ్రతుకు బాగుపడడం తప్ప 

 

*ల* - క్ష్యం లేని జీవితానికి విలువెక్కడిది? 

         అలలులేని కడలికి అందమెక్కడిది ?, వె 

 

*య్య* - కు నిచ్చెన ఆశకు, ఆకాశానికి, మూసెయ్యకు 

          తలపుల్ని అవకాశాలకు, అదృష్టానికి 

 

*క* - మ్మని కలలు కను, కంటినిండా నిద్రపో, కాని

         ఆ కలలు నిజమయ్యేంత వరకు కునుకుతియ్యకు

 

*వి* - జయం వస్తుంది, ముందే నిలుస్తుంది

         వీరులను, విజేతలను విందుకు పిలుస్తుంది